ఆ వాచ్ ఖరీదు 116 కోట్లా..
- January 05, 2018
వందరూపాయల వాచ్ అయినా వెయ్యి రూపాయిల వాచ్ అయినా ఒకే టైమ్‌ని చూపిస్తుంది. మరి దానికోసం కోట్లు పెట్టి కొనాలా అంటే.. ఏమో దాన్లో ఏం ప్రత్యేకతలు ఉన్నాయో చూద్దాం. చదివి ఆనందిద్దాం... స్టెయిన్ లెస్ స్టీల్‌తో చేసిన ఒక రోలెక్స్ వాచీని ఇటీవల న్యూయార్క్‌లో వేలం వేశారు. దాన్ని వేల కొట్లున్న ఓ మారాజు వాచ్ ఖరీదు వంద కోట్లే కదా అని కొనేశాడు. దాని ఖరీదు రూ.116 కోట్లు పలికింది వేలంలో. ఈ వాచ్‌ని గతంలో దివంగత హాలీవుడ్ నటుడు పాల్ న్యూమాన్ వాడారు. దీన్ని ఆయన భార్య అతడికి కానుకగా ఇచ్చిందట. ఈ వాచ్‌ని తరువాత తన కుమార్తెకు ఇచ్చారు న్యూమాన్. ఆమె నుంచి న్యూమాన్ స్నేహితుడు జేమ్స్ కాక్స్ వద్దకు చేరింది. ఇప్పడు తాజాగా కాక్స్ ఈ గడియారాన్ని వేలానికి పెట్టారు. అది వేలంలో 17.8 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది. మన ఇండియన్ కరెన్సీలో రూ.116 కోట్ల రూపాయలు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







