పోలాండ్ కుర్రాడి నోట పవర్ స్టార్ 'కొడకా కోటేశ్వరరావు' సాంగ్
- January 05, 2018
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలా ఉంటుందో, ఆయనకి ఎలాంటి అభిమానులు ఉంటారో మరో సారి ప్రూవ్ అయ్యింది. అలాగే పవన్ కళ్యాణ్, అభిమానులను ఎలా ట్రీట్ చేస్తారో కూడా అజ్ఞాతవాసి సినిమా ద్వారో మరో సారి తెలిసింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం ఈ నెల 10న విడుదల కాబోతుంది. భారీ అంచనాలున్న ఈ చిత్రంలో, చాలా హైలైట్స్ ఉన్నాయి. వాటిల్లో పవన్ కళ్యాణ్ పాడిన కొడకా కోటేశ్వరరావు స్పెషల్ సాంగ్ కూడా ఉంది. ఈ సాంగ్ తెలుగు ఆడియన్స్ నే కాదు, ఫారిన్ సినీ లవర్స్ ని కూడా ఆకట్టుకుంటోంది.
పోలాండ్ కి చెందిన జిబిగ్స్ అనే ఓ చిన్న కుర్రాడికి, కొడకా కోటేశ్వరరావు పాట నచ్చి, చాన్ స్వయింగా పాడి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఆ పాట పవన్ అభిమానులనే కాదు, పవన్ ని కూడా మెప్పించింది. దీంతో పవర్ స్టార్, ఆ చిన్న కుర్రాడికి కృతజ్ఞతలు చెప్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. దానీకి ఆ కుర్రాడు ఈ నెల 9న, పవన్ కోసం స్పెషల్ గా ఓ పాట పాడి పంపిస్తానని రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అభిమానులు పవర్ స్టార్ ని ఎలా అభిమానిస్తారో తెలియజేసే ఎగ్జాంపుల్ గా ఈ విషయాన్ని తీసుకోవచ్చు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







