భారీ ప్రచారానికి వెళుతున్న పవర్ స్టార్
- January 05, 2018
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సినిమా అజ్ఞాతవాసి. ఈ సినిమా విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. పవన్ ఈ నెల 9న అజ్ఞాతవాసి ప్రీమియర్ షోలు చూసుకొని అమెరికా వెళతారని టాక్. అక్కడ అజ్ఞాతసికి భారీ ఎత్తున ప్రచారంకార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఎల్ఎ తెలుగుసంస్థ అజ్ఞాతవాసి సినిమా హక్కులను భారీ రేటుకు కొన్నారు. కొనడమే కాకుండా, భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇంతవరకు ఏ భారతీయ సినిమా విడుదల కానన్ని స్క్రీన్ లలో అజ్ఞాతవాసిని విడుదల చేస్తున్నారు. అంతేకాదు అక్కడ పవన్ అభిమానులకోసం ప్రత్యేకంగా అజ్ఞాతవాసి పేరుతో టి షర్ట్ లు కూడా అందించనున్నట్టు వినికిడి.
త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మితమయిన ఈ చిత్రం సోషల్ మీడియాలో కూడా మైండ్ బ్లోయింగ్ పాపులారిటీని సంపాదించుకుంది. ఈ చిత్రంలో పవన్ తన గొంతుతో మైమరిపించిన "కొడకా కోటేశ్వరరావు" పాట గత సంవత్సరం డిసెంబర్ 31 న విదుదల అయ్యి ఇప్పటికి ట్రేండింగ్ లో కొనసాగుతుంది. ఇదిలావుంటే అజ్ఞాతవాసి అమెరికా ప్రమోషన్ కోసం కేవలం పవన్ మాత్రమే వెళతాడా లేక చిత్ర నిర్మాత , దర్శకుడు కూడా వెళతారనేది స్పష్టంగా తెలియాలి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల