టొరంటో:ఎయిర్‌పోర్ట్‌లో ఢీకొన్న రెండు విమానాలు
- January 05, 2018
టొరంటో: కెనడాలో రెండు విమానాలు ఢీకొన్నాయి. టొరంటో విమానాశ్రయంలోనే ఈ ఘటన జరిగింది. అసలే దట్టమైన మంచుతో వణికిపోతున్న ప్రయాణికులకు.. విమానాలు ఢీకొన్న ఘటన మరింత భయభ్రాంతులకు గురిచేసింది. శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. వెస్ట్జెట్కు చెందిన విమానం మెక్సికో నుంచి టొరంటోకు చేరుకున్నది. ఆ విమానంలో సుమారు 168 మంది ప్యాసింజెర్లు ఉన్నారు. ఎయిర్‌పోర్ట్‌లోని గేటు వద్ద సన్‌వింగ్ సంస్థ విమానం వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వెస్ట్‌జెట్ విమానాన్ని ఢీకొట్టింది. అయితే రెండు విమానాలు ఢీకొనగానే, ఓ విమానం నుంచి మంటలు వ్యాపించాయి. వెస్ట్‌జెట్ విమానంలో ఉన్న ప్రయాణికులను వెంటనే దించేశారు. ఎమర్జెన్సీ ైస్లెడ్స్ నుంచి ప్రయాణికులను బయటకు పంపించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సన్వింగ సంస్థ విమానంలో మాత్రం ప్రమాద సమయంలో ఎవరూ లేరు. ఈ ఘటన పట్ల విచారణ చేపడుతున్నట్లు కెనడా విమానశాఖ పేర్కొన్నది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







