టొరంటో:ఎయిర్‌పోర్ట్‌లో ఢీకొన్న రెండు విమానాలు

- January 05, 2018 , by Maagulf
టొరంటో:ఎయిర్‌పోర్ట్‌లో ఢీకొన్న రెండు విమానాలు

టొరంటో: కెనడాలో రెండు విమానాలు ఢీకొన్నాయి. టొరంటో విమానాశ్రయంలోనే ఈ ఘటన జరిగింది. అసలే దట్టమైన మంచుతో వణికిపోతున్న ప్రయాణికులకు.. విమానాలు ఢీకొన్న ఘటన మరింత భయభ్రాంతులకు గురిచేసింది. శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. వెస్ట్‌జెట్‌కు చెందిన విమానం మెక్సికో నుంచి టొరంటోకు చేరుకున్నది. ఆ విమానంలో సుమారు 168 మంది ప్యాసింజెర్లు ఉన్నారు. ఎయిర్‌పోర్ట్‌లోని గేటు వద్ద సన్‌వింగ్ సంస్థ విమానం వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వెస్ట్‌జెట్ విమానాన్ని ఢీకొట్టింది. అయితే రెండు విమానాలు ఢీకొనగానే, ఓ విమానం నుంచి మంటలు వ్యాపించాయి. వెస్ట్‌జెట్ విమానంలో ఉన్న ప్రయాణికులను వెంటనే దించేశారు. ఎమర్జెన్సీ ైస్లెడ్స్ నుంచి ప్రయాణికులను బయటకు పంపించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సన్‌వింగ సంస్థ విమానంలో మాత్రం ప్రమాద సమయంలో ఎవరూ లేరు. ఈ ఘటన పట్ల విచారణ చేపడుతున్నట్లు కెనడా విమానశాఖ పేర్కొన్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com