'టచ్‌ చేసి చూడు' టీజర్‌ విడుదల

- January 05, 2018 , by Maagulf
'టచ్‌ చేసి చూడు' టీజర్‌ విడుదల

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు రవితేజ జోరుమీదున్నారు. గతేడాది 'రాజా ది గ్రేట్‌' చిత్రంతో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఆయన త్వరలోనే 'టచ్‌ చేసి చూడు' అంటూ సవాల్‌ విసరబోతున్నారు. విక్రమ్‌ సిరికొండ దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'టచ్‌ చేసి చూడు'. రాశీఖన్నా కథానాయిక. ఈ సినిమా టీజర్‌ను శనివారం చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో రవితేజ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు చెదరగొడుతుండగా, ఓ వ్యక్తి మెడలో టైరు వేసి ఈడ్చిపారేస్తూ రవితేజ కనిపించారు. ఆ తర్వాత కళ్లాద్దాలు తీసి స్టైల్‌గా రవితేజ నడిచి వచ్చే సన్నివేశం ఆకట్టుకుంటోంది. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై నల్లమలపు శ్రీనివాస్‌(బుజ్జి), వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ సంగీత దర్శకుడు ప్రీతమ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. మరోపక్క రవితేజ తన సినిమాల జోరు పెంచేశారు. నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న 'అ!' చిత్రంలో ఓ చెట్టుకు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వగా, కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు.

ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించారు. మాళవిక శర్మ ఇందులో కథానాయిక. రామ్‌ తుళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు 'నేల టికెట్‌' అనే పేరు పరిశీలనలో ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com