గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం

- January 05, 2018 , by Maagulf
గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం

డా. మోహన్ బాబు ప్రధాన పాత్ర లో నటిస్తున్న ‘గాయత్రి’ చిత్రాన్ని ఫిబ్రవరి 9 న విడుదల చేయు సన్నాహాలు చేస్తున్నారు. విలక్షణ నటుడి పవర్ఫుల్ ఫస్ట్ లుక్ క్రిస్మస్ కు విడుదల కాగా విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రంలో మొదటి సారిగా విష్ణు మంచు, శ్రియలు జంటగా నటిస్తున్నారు. వీరిరువురు ఆదర్శ దంపతులుగా కనిపిస్తూ కొత్త సంవత్సరం రోజున విడుదలైన పోస్టర్ సందడి చేసింది. తాజాగా చిత్ర బృందం శ్రియ పోస్టర్ విడుదల చేసింది. మధ్యతరగతి గృహిణిగా చక్కటి చీరకట్టుతో ఆకర్షణీయంగా ఉన్న శ్రియ లుక్ కి కూడా మంచి స్పందనే వస్తుంది.  "నేనేదనుకుంటే అది చెప్పడం నాకు అలవాటు, తర్వాత సంగతి తర్వాత" అని పోస్టర్ పై ఉన్న కాప్షన్ శ్రియ పాత్ర కు ఉన్న ప్రాధాన్యతను వివరిస్తుంది. 

మదన్ దర్శకత్వం వహించిన గాయత్రి చిత్రానికి ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూర్చారు. నిఖిల విమల్ మరియు బ్రహ్మానందం  ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 9 న మన ముందుకు రాబోతున్న గాయత్రీ చిత్రాన్ని డా.యమ్.మోహన్ బాబు తన ప్రతిష్టాత్మక బ్యానర్ అయిన శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ పై నిర్మించగా అరియానా, వివియానా మరియు విద్యా నిర్వాణ సమర్పిస్తున్నారు.

సాంకేతిక వర్గం:
కథ-మాటలు: డైమండ్ రత్న బాబు 
సంగీతం: ఎస్.ఎస్.తమన్, 
ఛాయాగ్రహం: సర్వేశ్ మురారి, 
ఆర్ట్: చిన్న, 
ఎడిటర్: ఎంఆర్ వర్మ, 
ఫైట్స్: కనల్ కణ్ణన్, 
కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, గణేష్ ఆచార్య. 
కో-డైరెక్టర్స్: అనిల్ కుమార్ కె.వి.ఎస్.ఎన్,రవి బయ్యవరపు
కో-రైటర్: రవి బయ్యవరపు
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయకుమార్.ఆర్
నిర్మాత: డా. మోహన్ బాబు యమ్. 
దర్శకత్వం: మదన్ రామిగాని

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com