కశ్మీర్‌లో భారీ పేలుడు....4 మంది పోలీసులు మృతి

- January 05, 2018 , by Maagulf
కశ్మీర్‌లో భారీ పేలుడు....4 మంది పోలీసులు మృతి

జమ్ము కశ్మీర్‌:జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లాలో భారీ పేలుడు జరపటంతో నలుగురు పోలీస్‌ సిబ్బంది ప్రాణాలు వదిలారు. ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. 

శనివారం ఉదయం రద్దీగా ఉండే ఓ మార్కెట్‌ సముదాయం వద్ద ఐఈడీ మందుపాతరతో ఉగ్రవాదులు పేలుడు జరిపారు. పేలుడు ధాటికి ఓ షాపు పూర్తిగా కుప్పకూలిపోయిందని.. తీవ్రత చాలా దూరం ప్రభావం చూపిందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీగా భద్రతా సిబ్బందిని మోహరించిన సైన్యం.. ఉగ్రవాదుల కోసం చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.  గాయపడిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com