ఒక్కరోజు షూటింగ్ కి రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్న ఐశ్వర్య
- January 06, 2018
అందాల తార ఐశ్వర్యారాయ్ అమ్మైనా మార్కెట్లో అమ్మడి డిమాండ్ తగ్గలేదని మరోసారి నిరూపించుకుంది. అమ్మైనా అడపాదడపా సినిమాలు చేస్తూ అభిమానుల్నిఅలరిస్తూనే ఉంది. ప్రస్తుతం అనిల్ కపూర్ 'ఫ్యనీ ఖాన్' చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం తరువాత మరో చిత్రానికి సైన్ చేసింది. ఆ చిత్రం 'రాత్ ఔర్ దిన్'. ఈ చిత్రం అలనాటి స్టార్ హీరోయిన్ నర్గీస్ దత్ నటించిన చిత్రానికి రీమేక్. అయితే ఐశ్వర్య డిమాండ్ చేసిన పారితోషికాన్ని చూసి నిర్మాతలు ఐష్‌ని ఆడిపోసుకుంటున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ఇంత డిమాండ్ చేయడం ఏటంటూ నోళ్లు వెళ్లబెడుతున్నారు. మరి ద్విపాత్రాభినయం చేయాలంటే ఆ మాత్రం ఇచ్చుకోవాల్సిందే అంటూ వివరణ ఇచ్చుకుంటోంది. భిన్న మనస్తత్వాలు కలిగిన రెండు పాత్రలు చేయాలంటే మరి మెంటల్‌గా చాలా ప్రిపేర్ అవ్వాలంటోంది. అందుకోసం ఆ మాత్రం అడగడంలో తప్పులేదంటోంది. నిర్మాత ప్రేరణ అరోరా సైతం ఐశ్వర్య అడిగినంత ఇవ్వడానికి ఓకే అనేశారు. ఆ పాత్రకున్న ప్రాధాన్యత అలాంటిది అని అంటున్నారు. 1967లో వచ్చిన ఈ చిత్రంలో నర్గీస్ నటించింది. ఆమె అద్భుతమైన నటనకు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. మరి ఐశ్వర్యకు కూడా ఈ చిత్రం రూ. 10 కోట్ల రివార్డుతో పాటు అవార్డులనూ తెచ్చి పెడుతుందని ఆశిద్దాం.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







