గల్ఫ్ కప్ ఫైనల్: బ్యారియర్ కూలి 40 మందికి గాయాలు
- January 06, 2018
కువైట్‌లో ఒమన్ - యూఏఈ మధ్య జరిగిన గల్ఫ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా స్టేడియం బ్యారియర్ కూలి 40 మందికి గాయాలయ్యాయి. మ్యాచ్‌ని ఒమన్ గెలిచిన కాస్సేపటికే ఈ ప్రమాదం జరిగింది. కువైట్ ఎఫ్ఎ ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించింది. షేక్ జబెర్ అల్ అహ్మద్ స్టేడియం - కువైట్ సిటీలో ఈ ప్రమాదం జరిగిందని అధికారిక ప్రకటనలో వెల్లడించారు. గాయపడ్డవారంతా క్షేమంగానే ఉన్నారని కువైట్ అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఆటగాళ్ళను అభినందించే క్రమంలో అభిమానులు చూపించిన అత్యుత్సాహం కూడా ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







