సౌదీ అరేబియాలో ఫ్యూయల్‌ స్టేషన్‌ని తగలబెట్టిన వ్యక్తి

- January 06, 2018 , by Maagulf
సౌదీ అరేబియాలో ఫ్యూయల్‌ స్టేషన్‌ని తగలబెట్టిన వ్యక్తి

సౌదీ అరేబియా:ఓ వ్యక్తి ఫ్యూయల్‌ స్టేషన్‌కి నిప్పు పెట్టిన ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. నిప్పు పెట్టిన ఆ వ్యక్తి వెంటనే అక్కడినుంచి పారిపోయాడు. సంప్రదాయ కండూరా ధరించిన ఆ వ్యక్తి, పెట్రోల్‌ పంప్‌లో కొంత ఆయిల్‌ పారబోసి, లైటర్‌ ద్వారా అగ్ని రాజేశాడు. ఫ్యూయల్‌ స్టేషన్‌ తగలబడ్తోంటే, అక్కడినుంచి ఆ వ్యక్తి దూరంగా పారిపోయినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌ అయ్యింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది ఇంకా తెలియరాలేదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com