అరుదైన ఘనతను సొంతం చేసుకున్నఆర్ఎఫ్సీ
- January 06, 2018
హైదరాబాద్: ప్రపంచ చిత్ర నిర్మాణంలో సకల సౌకర్యాల నిలయంగా ఖ్యాతికెక్కిన రామోజీ ఫిల్మ్‌సిటీ (ఆర్ఎఫ్సీ) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సినిమా నిర్మాణ సదుపాయాలను పర్యావరణ హితంగా ఒకేచోట నిలిపే ఆర్ఎఫ్సీని `లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్‌సిటీ ఇన్ ది వరల్డ్`గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది. ఈ మేరకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేసింది. హాలీవుడ్, బాలీవుడ్ల నుంచి టాలీవుడ్ వరకు చిత్ర నిర్మాణాలకు ఆలవాలమైన రామోజీ ఫిల్మ్‌సిటీని ప్రపంచ స్థాయి సినిమా షూటింగ్ లొకేషన్లు, సెట్టింగ్‌లు, సాంకేతిక సామగ్రి, సదుపాయాలు ఒకేచోట లభ్యమయ్యే ప్రదేశంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది. ఈ మేరకు రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావును కలిసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ భారత అధ్యక్షుడు సంతోష్ శుక్లా ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఫిల్మ్ సిటీ ఎండీ రామ్మోహన్రావు, సీఈవోలు బాపినీడు, రాజీవ్ జల్నా పూర్కర్ తదితరులు పాల్గొన్నారు. హాలీవుడ్, బాలీవుడ్ల్లోని చిత్ర నిర్మాణ ప్రదేశాలన్నింటినీ పరిశీలించామని సంతోష్ శుక్లా తెలిపారు. ఆర్ఎఫ్సీలో మాత్రం పర్యావరణానికి పెద్దపీట వేయడం తమను ఎంతగానో ఆకర్షించిందన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







