అరుదైన ఘనతను సొంతం చేసుకున్నఆర్‌ఎఫ్‌సీ

- January 06, 2018 , by Maagulf
అరుదైన ఘనతను సొంతం చేసుకున్నఆర్‌ఎఫ్‌సీ

హైదరాబాద్‌: ప్రపంచ చిత్ర నిర్మాణంలో సకల సౌకర్యాల నిలయంగా ఖ్యాతికెక్కిన రామోజీ ఫిల్మ్‌సిటీ (ఆర్‌ఎఫ్‌సీ) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సినిమా నిర్మాణ సదుపాయాలను పర్యావరణ హితంగా ఒకేచోట నిలిపే ఆర్‌ఎఫ్‌సీని `లార్జెస్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ ఫిల్మ్‌సిటీ ఇన్‌ ది వరల్డ్‌`గా వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ గుర్తించింది. ఈ మేరకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేసింది. హాలీవుడ్‌, బాలీవుడ్‌ల నుంచి టాలీవుడ్‌ వరకు చిత్ర నిర్మాణాలకు ఆలవాలమైన రామోజీ ఫిల్మ్‌సిటీని ప్రపంచ స్థాయి సినిమా షూటింగ్‌ లొకేషన్లు, సెట్టింగ్‌లు, సాంకేతిక సామగ్రి, సదుపాయాలు ఒకేచోట లభ్యమయ్యే ప్రదేశంగా వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ గుర్తించింది. ఈ మేరకు రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావును కలిసి వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ భారత అధ్యక్షుడు సంతోష్‌ శుక్లా ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఫిల్మ్‌ సిటీ ఎండీ రామ్మోహన్‌రావు, సీఈవోలు బాపినీడు, రాజీవ్‌ జల్నా పూర్కర్‌ తదితరులు పాల్గొన్నారు. హాలీవుడ్‌, బాలీవుడ్‌ల్లోని చిత్ర నిర్మాణ ప్రదేశాలన్నింటినీ పరిశీలించామని సంతోష్ శుక్లా తెలిపారు. ఆర్‌ఎఫ్‌సీలో మాత్రం పర్యావరణానికి పెద్దపీట వేయడం తమను ఎంతగానో ఆకర్షించిందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com