'జువ్వ' సినిమా మోషన్ పోస్ట‌ర్ విడుద‌ల‌

- January 06, 2018 , by Maagulf
'జువ్వ' సినిమా మోషన్ పోస్ట‌ర్ విడుద‌ల‌

రంజిత్, పాల‌క్ ల‌ల్వానీ  హీరో, హీరోయిన్ల‌గా న‌టిస్తోన్న చిత్రం `జువ్వ‌`. `దిక్కులు చూడ‌కు రామయ్య‌` ఫేం  త్రికోటి పేట ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఎస్. వి. ర‌మ‌ణ స‌మ‌ర్ప‌ణ‌లో సొమ్మి ఫిలింస్ పై డా. భ‌ర‌త్ సోమి నిర్మిస్తున్నారు. ఎమ్. ఎమ్. కీర‌వాణి సంగీతం స‌మ‌కూర్చారు. ఈ సినిమా హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియో లో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అండ్ ఫ్యామిలీ, నిర్మాత దిల్ రాజు, వైకాపా నాయ‌కుడు బొత్స స‌త్స‌నారాయ‌ణ చేతుల మీదుగా ఆ మ‌ధ్య‌  ప్రారంభ‌మైంది. 

ఇప్ప‌టికే  షూటింగ్ పూర్తిచేసుకుంది. హైద‌రాబాద్ లో కొన్ని స‌న్నివేశాలు,  వైజాగ్ లో ఒక పాట‌..మరికొన్ని స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. అలాగే మ‌లేషియాలో రెండు పాట‌లు,  బెంగుళూరులో కారు ఛేజింగ్ స‌న్నివేశాలు షూట్ చేశారు. తాజాగా యూనిట్ ప్ర‌మోష‌న్ యాక్టివీటీస్ ను కూడా ప్రారంభించింది. దీనిలో భాగంగా నేడు చిత్ర మోషన్ పోస్ట‌ర్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. అతి త్వ‌ర‌లోనే మెగాస్టార్ చిరంజీవి చేతుల  మీదుగా  ఫ‌స్టు లుక్ పోస్ట‌ర్ మ‌రియు టీజ‌ర్ రిలీజ్ చేయ‌నున్న‌ట్లు యూనిట్ తెలిపింది. అలాగే ఇదే నెల మూడ‌వ వారంలో ఆడియోను, ఫిబ్ర‌వ‌రి లో సినిమా రిలీజ్ కు నిర్మాణ సంస్థ స‌న్నాహాలు చేస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com