'బాస్మతి బ్లూస్' ట్రైలర్!

- January 06, 2018 , by Maagulf
'బాస్మతి బ్లూస్' ట్రైలర్!

తెలుగు నటి మంచు లక్ష్మి తన అదృష్టాన్ని హాలీవుడ్‌లో పరీక్షించుకోనున్నారు. ఆమె నటించిన హాలీవుడ్ మూవీ 'బాస్మతి బ్లూస్'. ఈ మూవీ ట్రైలర్‌ను మూవీ యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా మూవీ ట్రైల‌ర్‌ను ఆమె త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఫిబ్రవరి 9 న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవనుంది. ఓ ఫారెన్ సైంటిస్ట్ తన పరిశోధనలో భాగంగా ఇండియాకు రావడం... తర్వాత ఇక్కడ ఓ అబ్బాయితో పరిచయం ఏర్ప‌డ‌టం.... ఆ పరిచయం కాస్త ప్రేమగా మార‌టం.... ఈ స్టోరీ ఇతివృత్తంగా సినిమా సాగుతుంది. డాన్ బారన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో బ్రీ లార్సన్, అంబుద్కర్ ప్రధాన పాత్రల్లో నటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com