2017 లో బహ్రెయిన్ రోడ్లపై 40 మందికి పైగా ప్రజలు మృతి

- January 06, 2018 , by Maagulf
2017 లో బహ్రెయిన్ రోడ్లపై 40 మందికి  పైగా ప్రజలు మృతి

మనామా : గత ఏడాది బహ్రెయిన్ రోడ్లపై 40 మందికి  పైగా ప్రాణాలు కోల్పోయారు. ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్  ఇటీవల విడుదల చేసిన గణాంకాలు ప్రకారం, 2017 మొదటి మూడు త్రైమాసికాల్లో కింగ్డమ్ లో  రోడ్డు ప్రమాదాలలో నలభైమంది మరణించారు. ఈ ప్రమాదాల్లో ఎక్కువ భాగం వాహనదారులు ఎరుపు సంకేతాలను దాటివెళ్లిపోవడం వలన జరుగుతున్నట్లు నివేదికలు తెలియచేస్తున్నాయి. మొబైల్ ఫోన్లలో  మాట్లాడుతూ, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మాట్లాడటం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు.    ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ తెలిపిన సమాచారం ప్రకారం 2017 లో  జనవరి, అక్టోబర్ మధ్యకాలంలో దేశంలో 932 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాలలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. మరొక 890 మంది గాయపడ్డారు. 377 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. 2016 లో బహ్రెయిన్ మొత్తం మీద 1,408 ప్రమాదాలే నమోదు కాబడ్డాయి. ఆ ఏడాది 47 మంది మరణించారు. అదేవిధంగా1300 మంది గాయపడ్డారు.2014 లో 23  వ చట్టం ప్రకారం  ట్రాఫిక్ ఉల్లంఘనలను నిరోధించడానికి  ఫిబ్రవరిలో ఒక పాయింట్ల వ్యవస్థను ప్రవేశపెట్టి, రాజ్యంలో పటిష్టమైన శిక్షలు అమలులోకి వచ్చాయి. ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్  షైక్ నాజర్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా మాట్లాడుతూ, ప్రత్యేకంగా ట్రాఫిక్ నియమాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినవారికి అవగాహన కల్పించడం..అలాగే  వాహనాలు నడిపే డ్రైవర్లు బాధ్యతయుతంగా ప్రవర్తించేవిధంగా ప్రోత్సహించడానికి ఉద్దేశించినదని ఆయన తెలిపారు "

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com