మోదీ, గాంధీ లతో సెల్ఫీ

- January 06, 2018 , by Maagulf
మోదీ, గాంధీ లతో సెల్ఫీ

జాతిపిత మహాత్మాగాంధీతో ప్రధాని నరేంద్రమోదీ కలిసి ఉన్న ఈ దృశ్యం మన భాగ్యనగరంలోని చారిత్రక చార్మినార్‌ వద్ద శనివారం సాక్షాత్కరించింది. గాంధీ మహాత్ముడితో ప్రధాని మోదీ భేటీ ఎలా సాధ్యం..? ఇందుకు అవకాశమే లేదు కదా..?? అని తీవ్రంగా ఆలోచిస్తున్నారా..! మీరు అనుకుంటున్నది అక్షరాలా నిజమే.. ఈ ఫొటోలోని ఇద్దరు వ్యక్తులూ.. ఎంతమాత్రం నరేంద్ర మోదీ, గాంధీజీలు కాదు.. అచ్చుగుద్దినట్టు వారి పోలికలతో కనిపిస్తోన్న సదానంద్‌నాయక్‌, అగస్టీన్‌లు.. కర్ణాటక, గోవాల నుంచి హైదరాబాద్‌ సందర్శనకు వచ్చిన ఈ ఇద్దరూ చార్మినార్‌ వద్ద యాదృచ్ఛికంగా కలిశారు. దీంతో పర్యాటకులు, స్థానికులు వీరిని చూసేందుకు పోటీపడ్డారు. ఈ సందర్భంగా యువత వారితో పెద్దఎత్తున సెల్ఫీలు దిగడంతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com