ఫిబ్రవరి మొదటి వారం నుంచి 'సైరా..' రెండో షెడ్యూల్ మొదలు
- January 06, 2018
చిరంజీవి చారిత్రక చిత్రం 'సైరా..నరసింహారెడ్డి' షూటింగ్ స్పీడ్ పెంచబోతున్నారు. వరుస షెడ్యూల్స్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉందట చిరు అండ్ టీమ్.
చిరంజీవి ప్రిస్టేజియస్ హిస్టారికల్ డ్రామా 'సైరా నరసింహారెడ్డి'. ఈ చిత్రం ఇటీవల హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది.. ఈ షెడ్యూల్లో క్లైమాక్స్ ఘట్టాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించారట. ప్రస్తుతం సెలవుల్లో ఉన్న 'సైరా' టీమ్ ఫిబ్రవరి మొదటి వారంలో రెండో షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది. పొల్లాచ్చిలో జరగనున్న సెకండ్ షెడ్యూల్లో గ్రామీణ వాతావరణానికి సంబంధించిన సీన్స్‌ను చిత్రీకరించనున్నారట. హీరోయిన్ నయనతార కూడా ఈ షెడ్యూల్ లోనే 'సైరా..' యూనిట్ లో జాయిన్ కాబోతుందట.
పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తయిన తర్వాత గ్యాప్ లేకుండా వెంటనే హైదరాబాద్‌లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసిందట 'సైరా..' యూనిట్. అందులో బ్రిటీష్ సామ్రాజ్యానికి సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తారట. దీనికి సంబంధించిన సెట్స్‌ను ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ సిద్ధం చేస్తున్నారు కూడా. ఆ షెడ్యూల్ లోనే అమితాబ్ బచ్చన్, సుదీప్ పాల్గొంటారట. అలా వరుస షెడ్యూల్స్‌లో 'సైరా..' పూర్తి చేసి ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలన్నది నిర్మాత రామ్‌చరణ్ ఆలోచనట.
ఇదిలా ఉంటే టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి-మోహన్ బాబు- రాజశేఖర్ మధ్య సయోధ్య మరోసారి బయటపడింది. అప్పుడప్పుడూ తమ మధ్య చిన్న చిన్న అపార్థాలు వచ్చినా తామంతా ఒక్కటే అని మరోసారి నిరూపించారు ఈ సీనియర్ స్టార్స్. ఇటీవల నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎమ్.పి. సుబ్బిరామిరెడ్డి ఇచ్చిన విందులో వీరంతా ఎంతో ఉత్సాహంగా సందడి చేశారు. తమ స్నేహ బంధాన్ని చాటుకున్నారు
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







