కేసీఆర్ కు 'అజ్ఞాతవాసి' స్పెషల్ షో

- January 07, 2018 , by Maagulf
కేసీఆర్ కు 'అజ్ఞాతవాసి' స్పెషల్ షో

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఉప్పునిప్పుగా ఉన్న పవన్‌కల్యాణ్‌, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొన్న ప్రగతి భవన్‌లో కలవడం అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు పవన్ నటించిన 'అజ్ఞాతవాసి' సినిమా ప్రత్యేక షో వేస్తారంట. ఈ సినిమా చూడడానికి ప్రత్యేకంగా తెలంగాణ ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత రాధాకృష్ణ శనివారం (జనవరి-6) తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) చైర్మన్ రామ్మోహన్‌రావును తెలంగాణ సచివాలయంలో కలిశారు. ఈ నెల 10వ తేదీన సంక్రాంతి సందర్భంగా 'అజ్ఞాతవాసి' సినిమా విడుదలవుతోంది. మంత్రి కోసం 'అజ్ఞాతవాసి' స్పెషల్ షో ఏర్పాటు చేయనున్నారని సమాచారం. ఈ స్పెషల్ షోకు సీఎం కేసీఆర్‌ను కూడా ఆహ్వానించారని తెలిసింది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై అజ్ఞాతవాసి తీస్తున్న సినిమాలో కీర్తి సురేశ్‌, అనూ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com