టబుక్ లో రాత్రి పూట మంచు ..సూర్యోదయంలో మాయం
- January 07, 2018
సౌదీ అరేబియా : మంచు కురిసే వేళలో గల్ఫ్ వెల్లివిరుస్తుంది. ముఖ్యంగా సౌదీ అరేబియా టబుక్ లో మంచు విస్తారంగా కురుస్తుండడంతో వింతైన ఒక ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. శుక్రవారం సాయంత్రం అల్-లాజ్ పర్వత ప్రాంతాలలో తేలికపాటి మంచుతో పాటు వర్షం సైతం కురుస్తుండడంతో ఆ ప్రదేశాలలో భిన్న వాతావరణం నెలకొంది. ఒక " తెల్లని అతిథి " రాక అని స్థానిక ప్రజలచే పిలువబడే ఈ మంచు టబుక్ లో కురుస్తూ మరుసటిరోజు తెల్లవారుజామున అదృశ్యమవుతోంది. స్థానిక ప్రజలు ప్రతి సంవత్సరం ఈ అద్భుత దృశ్యాన్ని చూడటానికి..కురిసే మంచును ఆహ్వానించటానికి పర్వతం వద్దకు పెద్ద ఎత్తున చేరుకుంటారు. ప్రతి ఏడాది శీతాకాలంలో ఈ సమయం అందంగా.ఆహ్లాదకరంగా ఉంటుంది. సాధారణంగా ఈ మంచు రాత్రి సమయంలో కురవడం మొదలై మరుసటిరోజు ఉదయం కొన్నిగంటల వరకు కొనసాగుతుంది. జబల్ అల్-లాజ్ కొన్ని ప్రాంతాలలో మంచుతెరలు పాలసముద్రాన్ని తలపిస్తూ దట్టంగా కమ్ముకుని ఉండడంతో ప్రజలంతా టబుక్ అందాలని చూసి మంత్రముగ్ధులు అవుతున్నారు. తెల్లని మంచు దట్టంగా అలుముకోవడంతో క్రమంగా ఆయా ప్రదేశాలు ' హిమ మాయ ' లో కొద్దిసేపు కనిపించకుండాపోతున్నాయి..వేకువ జామున మంచు తెరలు కమ్ము కుంటున్నాయి. దాదాపు ఉదయం ఏడు గంటల వరకు మంచు విస్తారంగా కురుస్తుండడంతో వాహన చోదకులు లైట్లు సహాయంతో నెమ్మదిగా ప్రయాణాలు సాగిస్తున్నారు. జబల్ అల్-లాజ్ కు దారితీసే రహదారులలో భద్రతా దళాలు, ట్రాఫిక్ పోలీసు, పౌర రక్షణ మరియు రెడ్ క్రెసెంట్ ఈ ప్రాంతంకు చేరుకొని ట్రాఫిక్ కొనసాగింపుని సురక్షితంగా నిర్వహించడానికి విధులు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!