దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా లైట్ షో ఈ ఏడాది మార్చి వరకు కొనసాగనుంది
- January 08, 2018
దుబాయ్: దుబాయ్ లో ప్రపంచపు అత్యంత ఎత్తైన గోపురం నూతన సంవత్సరం ఈవ్ లైట్ షోలో పాల్గొన్నవారికి ఇప్పటికీ జరుగుతున్నది జరుగుతున్నట్లు చూడటానికి అవకాశం లభించనుంది. సందర్శకుల కోసం ఈ ఏడాది మార్చి చివరి వరకు కొనసాగించనున్నారు. భవనం చివరి కొనభాగం వరకు పరిగణలోకి తీసుకుంటే అత్యంత పొడవైన ఆకాశసౌధం: 828 మీటర్ల (2,717 అడుగుల ) పొడవు దీనిలో మొత్తం 30,000 గృహాలు, ది అడ్రస్ డౌన్‌టౌన్ దుబాయ్, 3 హెక్టార్లు (7.4 ఎకరాలు) విస్తీర్ణం కలిగిన పార్క్‌ల్యాండ్ లాంటి తొమ్మిది హోటళ్లు, కనీసం 19 నివాస భవంతులు, దుబాయ్ మాల్, మరియు 12-హెక్టార్లు (30-ఎకరాల) విస్తీర్ణం కలిగిన మానవ-నిర్మిత బుర్జ్ ఖలీఫా సరస్సు తదితరాలు ఉండేలా ఈ అభివృద్ధి ప్రణాళికను రూపొందించారు. ప్రతి ఏడాది ఇక్కడ జరిగే కాంతి కార్యక్రమ ప్రదర్శన ప్రసిద్ధం ప్రపంచ రికార్డు బద్దలు చేస్తోంది. జనవరి 1 వ తేదీన జరిగిన బుర్జ్ ఖలీఫా లైట్ షో ను చూడనివారికోసం ఇప్పుడు నూతన సంవత్సరం యొక్క పండుగ వినోదం మరల వీక్షించే అవకాశం అందిస్తుంది. ఒక వారంలో ఐదు సార్లు అమలు చేస్తుంది. యూఏఈ నివాసితులు మరియు పర్యాటకులు దుబాయ్ కి వెళ్లి, ప్రతి రాత్రి మంగళవారం, బుధవారం ,మరియు శనివారాలలో అక్కడకు వెళ్లి లైట్ షోని తిలకించవచ్చు. అదేమాదిరిగా బుధవారం ,గురువారాలు మరియు శుక్రవారాలు రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రదర్శన ను చూడవచ్చు. " నూతన ఏడాది రోజున బుర్జ్ ఖలీఫా యొక్క లైట్ షోను చూడడానికి అవకాశం లేకపోయినవారు ఇప్పుడు మార్చి నెల వరకు ఈ ప్రదర్శన చూడవచ్చని ప్రకటించారు. నూతన సంవత్సరం సందర్భంగా లక్షలాది మంది ప్రేక్షకులను లేజర్ లైట్ ప్రదర్శన వీక్షించారు మరియు బుర్జ్ ఖలీఫా కోసం ఒక నూతన భవనం మీద అతిపెద్ద కాంతి మరియు ధ్వని ప్రదర్శనగా ఒక కొత్త గిన్నిస్ రికార్డును పొందిన సంగతి పలువురికి విదితమే .
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!