రజనీ పార్టీకి ఝలక్

- January 08, 2018 , by Maagulf
రజనీ పార్టీకి ఝలక్

తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ పెట్టాలనుకుంటున్న రాజకీయ పార్టీకి ఆదిలోనే ఒక 'ఝలక్' తప్పేలా లేదు. పార్టీ రూపురేఖలు అధికారికంగా ప్రకటించకపోయినా, రజనీ పార్టీ ఎన్నికల గుర్తు మీద మాత్రం ఒక మోస్తరు క్లారిటీ వచ్చేసింది. చూపుడువేలు, చిటికెన వేలు పైకెత్తి చూపే 'బాబా ముద్ర'ను ఫైనల్ చేస్తారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పటికే ఈ గుర్తును ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ చేసినట్లు కూడా చెబుతున్నారు. కానీ.. ఈ సింబల్ దగ్గరే రజనీకాంత్ ఇరకాటంలో పడే పరిస్థితి నెలకొంది. ముంబైకి చెందిన 'వాక్స్ వెబ్' అనే స్టార్టప్ కంపెనీ.. 18 నెలల కిందటే దీన్ని తమ లోగోగా నిర్ధారించుకుంది. ఇప్పటికే ప్రచారంలో పెట్టుకుంది కూడా. ఈ సింబల్ తో ఒక సోషల్ నెట్వర్కింగ్ యాప్ విజయవంతంగా నడుస్తోంది. ఈ క్రమంలో రజనీ పార్టీ 'బాబా ముద్ర'తో ముందుకెళితే 'బోల్తాపడ్డం' ఖాయమని చెబుతున్నారు.

కమర్షియల్ మార్కెట్లో లోగో వివాదాలు కొత్త కాదు.

కానీ.. ఇది ఒక సోషల్ నెట్వర్కింగ్ కంపెనీకి, మరో రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యవహారం. పొలిటికల్ పార్టీలు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటున్న ఇవ్వాల్టి రోజుల్లో.. వాళ్ళతో కాపీ రైట్ సమస్యలు రాకుండా ఉండవని, అందుకే వ్యతిరేకించాలని నిర్ణయించుకున్నామని వాక్స్ వెబ్ ఫౌండర్ యాష్ మిశ్రా అంటున్నారు.

ఈ లెక్కన రజనీ తన ఆలోచనను మార్చుకోక తప్పదేమో! తాను సెంటిమెంటల్ గా బాగా నమ్మకం పెంచుకున్న 'బాబా ముద్ర'ను వదులుకోవడం కంటే.. 'వాక్స్ వెబ్' అనే ఆ బుడ్డ కంపెనీని కొనెయ్యడమే బెటరని రజనీ శిబిరం భావిస్తోందట!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com