'యాద్ ఆ రాహి హై' విత్ అమిత్ కుమార్.!
- January 08, 2018
కువైట్ : ప్రముఖ హిందీ సినీ నేపధ్య గాయకుడు, నటుడు , సంగీత దర్శకుడు కిషోర్ కుమార్ తనయుడు ఫిలింఫేర్ అవార్డు గ్రహీత అమిత్ కుమార్ మరియు బెంగాలీ గాయని మరియు నటి రుమా గుహ థాకుర్తా కలిసి "యాద్ ఆ రాహి హై" అనే సంగీత విభావరి లైవ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. వచ్చేనెల ఫిబ్రవరి 2 వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 :30 గంటలకు కువైట్ లో అనేక విజయవంతమైన ప్రోగ్రాంలు నిర్వహించిన ఇండియన్ కల్చరల్ సొసైటీ పయనీర్ అఫ్ క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియంలో జరగనున్న ఈ సంగీత విభావరి ప్రేక్షకులను అలరించనుంది. బాలీవుడ్ బ్యాండ్ సర్గమ్ స్టార్స్ , సహ గాయకుడు సైరా ఖాన్ మరియు కడుపుబ్బనవ్వించే హాస్యనటుడు రాజీవ్ మల్హోత్రాలు పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







