చారిటీకోసం అతిలోక సుందరి ఆర్ట్ వేలం

- January 08, 2018 , by Maagulf
చారిటీకోసం అతిలోక సుందరి ఆర్ట్ వేలం

టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగి బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ కూడా తన అందంతో అందరికీ కిక్కెంచింది. బోనీకపూర్‌ని పెళ్లి చేసుకుని ఇద్దరు బిడ్డలకు తల్లయింది. ఆ తరువాత అడపా దడపా సినిమాల్లో చేసినా ఇంతకు ముందులా రెగ్యులర్‌గా స్క్రీన్ పై సందడి చేయట్లేదు. ఇంగ్లీష్ వింగ్లీష్‌తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సక్సెస్ అయ్యింది. కానీ ఆ తరువాత వచ్చిన మామ్ అభిమానుల ఆదరణకు నోచుకోలేదు. అయితే పెద్ద కూతురు జాహ్నవి నటించే సినిమాలో తను కూడా ఓ పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీదేవికి పెయింటింగ్ చేయడమంటే చాలా ఇష్టమట. గత ఐదు సంవత్సరాలుగా పెయింటింగ్స్ వేస్తోందట. తనకు నచ్చిన వారికి ఇవ్వడం కోసం అందంగా పెయింటింగ్స్ వేసి తనకు వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటుందట. ఇటీవల సోనమ్ కపూర్‌కి ఓ అందమైన పెయింటింగ్ వేసి ఇచ్చిందట. ఇక సల్మాన్ ఖాన్, మనీష్ మల్హోత్రా వంటి సెలబ్రిటీలకు కూడా తన పెయింటింగ్స్ గిప్ట్‌గా ఇచ్చినట్లు సమాచారం. అయితే వచ్చే నెలలో దుబాయ్ ‌లో అంతర్జాతీయ ఎగ్జిబిషన్ సంస్థ శ్రీదేవి పెయింటింగులతో ఓ షో ఏర్పాటు చేస్తున్నారు. వచ్చిన మొత్తాన్ని ఓ చారిటీ నిధి కోసం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com