దుబాయ్ షాపింగ్ ఫెస్టివ్‌ల్ కోసంజెట్ ఎయిర్వేస్ ఆఫర్
- November 20, 2015
ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్.. వచ్చే ఏడాది జరగనున్న దుబాయ్ షాపింగ్ ఫెస్టివ్‌ల్ కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. స్వల్పకాలం మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్నవారికి రాను, పోను టికెట్ ధరను రూ.29,395గా నిర్ణయించింది. ఈ ఆఫర్‌లోభాగంగా దుబాయ్ నగరాన్ని సైతం తిలకించవచ్చును. ఈ ఆఫర్ కింద మూడు రాత్రులు, నాలుగు రోజులపాటు దుబాయిలోని ప్రత్యేక హోటల్లో వసతిని ఏర్పాటు చేయనున్నది. ఈ ఆఫర్లో టిక్కెట్ బుక్ చేసుకున్నవారు వచ్చే జనవరి 2 నుంచి ఫిబ్రవరి 1, 2016 మధ్యలో ప్రయాణం చేయాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ప్రతియేటా జనవరి-ఫిబ్రవరి మధ్యకాలంలో దుబాయ్‌లో జరిగే అతిపెద్ద షాపింగ్ ఉత్సవాలకు భారత్‌తోపాటు పలు దేశాల నుంచి భారీ సంఖ్యలో సందర్శకులు వెళ్తుంటారు. వారికోసమే ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







