గుండు హనుమంతరావుకి సాయం అందించిన తెలంగాణ ప్రభుత్వం
- January 08, 2018

ఒకప్పుడు కామెడీతో అలరించిన గుండు హనుమంతరావు ప్రస్తుతం కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా, ఈ మధ్య ఓ కార్యక్రమంలో తన ఆరోగ్య పరిస్థితిని వివరించాడు. ప్రస్తుతం తాను కష్టాలలో ఉన్నట్టు కూడా తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న మెగా స్టార్ చిరంజీవి గుండు హనుమంతరావుకి 2లక్షల రూపాయల చెక్ ను ‘మా’ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా ద్వారా అందజేశారు. ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆయన చికిత్స నిమిత్తం 5 లక్షల రూపాయల నగదుని ముఖ్యమంత్రి సహాయనిధి నుండి విడుదల చేసింది. ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ గుండు హనుమంతరావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గుండుకి వారంలో మూడు సార్లు డయాలసిస్ జరగాల్సి ఉండగా, చికిత్సకి అవసరమైన సొమ్ము లేకపోవడంతో ఇంట్లోనే ఉండి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడట. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఆ కమెడీయన్ కి సాయం అందించింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







