'కొడకా కోటేశ్వరరావు' పై విరుచుకుపడ్డ కోటేశ్వరరావు
- January 09, 2018
విజయవాడ: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమాలోని 'కొడకా కోటేశ్వరరావు' పాట వివాదాల్లో చిక్కుకుంది. తమ మనోభావాలు దెబ్బతినేలా పాట ఉందని న్యాయవాది కోటేశ్వరరావు ఆరోపించారు. దీనికి సంబంధించి మాచవరం పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్ గొంతు సవరించుకొని పాడిన ఈ పాట వివాదాల్లో చిక్కుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విడుదలకు సిద్ధంగా ఉన్న అజ్ఞాతవాసికి ఈ వివాదం ఏ మలుపు తిప్పుతుందోనని సినీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







