యావత్ భారతదేశంలోనూ నిర్వహిస్తాం: నారా భువనేశ్వరి
- January 09, 2018
హైదరాబాద్: నందమూరి 22వ వర్ధంతి సందర్భంగా జనవరి 18న రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశంలోని 150 కేంద్రాల్లో లెజెండరీ డ్రైవ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ చీఫ్ నారా భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేపట్టిన వివిధ కార్యక్రమాలపై ఆవిడ మీడియాతో మాట్లాడుతూ ''రెండేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో లెజెండరీ డ్రైవ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నాం. నీరు లేనిదే మనిషి లేడు. ఫ్లోరైడ్, ఉప్పు, నీరు ఉన్న చోట 67 ఎన్టీఆర్ సుజలా ప్లాంట్స్ స్థాపించాం. దీని ద్వారా 2 లక్షల మందికి రూ.2కే 20 లీటర్ల నీటిని అందిస్తున్నామని అన్నారు.
మహబూబ్నగర్, కర్నూల్, హైదరాబాద్, విశాఖపట్నం, ఉత్తరాఖండ్ తుఫాన్ బాధితులకు 15 కోట్ల విలువైన మందులు, బట్టలు పంపిణీ చేశాం. 150 శిబిరాల ద్వారా సుమారు 15 వేల మంది రక్తదానం చేసిన వారికి కృతజ్ణతలు. అలాగే దీనికి సహకరించిన ఇండియన్ రెడ్క్రాస్, రోటరీ లయన్స్, బసవరామతారక కాన్సర్ ఆసుపత్రి, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు'' అన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







