విరాట్ వీరాభిమాని ఆత్మహత్య.. కారణం ఏంటంటే
- January 09, 2018
టీమిండియా రధసారధి విరాట్ కోహ్లీ కోసం వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధ్యప్రదేశ్ రాట్లామ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ రాట్లామ్కు చెందిన 63ఏళ్ల బాబులాల్ భైరవ విరాట్ కోహ్లీకి వీరాభిమాని. క్రికెట్ అంటే అమితంగా ఇష్టపడే బాబూలాల్ టీమిండియా సారధి కోహ్లీని దైవంలా ఆరాధించాడు. విరాట్ ఆడే ప్రతి మ్యాచ్ ను తిలకించేవాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ కూడా బాబులాల్ ఒంటరిగా కూర్చొని చూశాడు. అయితే ఈ మ్యాచ్లో కోహ్లీ అదరగొడతాడని బాబూలాల్ భావించాడు. కానీ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి ఔట్ అవుట్ అవ్వడంతో మనస్థాపం చెందారు. దాంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఇది గమనించిన బాబూలాల్ భార్య ఆయన్ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







