చిన్నారిపై అత్యాచారం, హత్య: జస్ట్‌ ఫేక్‌ న్యూస్‌

- January 09, 2018 , by Maagulf
చిన్నారిపై అత్యాచారం, హత్య: జస్ట్‌ ఫేక్‌ న్యూస్‌

మస్కట్‌: ఒమన్‌లో ఓ చిన్నారిని అపహరించిన దుండగులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారనీ, అనంతరం ఆమెని హత్య చేశారనీ, మరో ఇద్దరు చిన్నారులూ కిడ్నాప్‌ అయ్యారని పేర్కొంటూ సోషల్‌ మీడియాలో ఓ వాయిస్‌ న్యూస్‌ సర్క్యులేట్‌ అవుతోంది. వైరల్‌గా మారిన ఈ ఉదంతంపై రాయల్‌ ఒమన్‌ పోలీసులు స్పందించారు. ఇదంతా ఫేక్‌ న్యూస్‌ మాత్రమేనని తేల్చారు. సోహార్‌లో ఓ బాలిక కిడ్నాప్‌కి గురయ్యిందనీ, అనంతరం ఆమెను చంపేశారనే వాయిస్‌ న్యూస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండడం తమ దృష్టికి కూడా వచ్చిందనీ, అది ఫేక్‌ న్యూస్‌ అని నిర్ధారణ అయ్యిందని పోలీసులు వెల్లడించారు. ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ని వైరల్‌గా మార్చుతున్నవారిపై కఠిన చర్యలుంటాయని పోలీసులు వివరించారు. సోషల్‌ మీడియా ద్వారా వివరాల్ని సేకరించి, దుష్ప్రచారం చేపట్టినవారిని అరెస్ట్‌ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com