దుబాయ్ పోలీస్ వారి 25వ గ్రాడ్యుయేషన్ డే
- January 10, 2018






దుబాయ్ పోలీస్.. ప్రపంచంలోనే అత్యాధునిక, మెరుగైన సర్వీసులు అందించడంలో వీరికి పెట్టింది పేరు. దుబాయ్ ను అనునిత్యం డేగ కన్నుతో కాచే దుబాయ్ పోలీస్ వ్యవస్థ నిన్న 'గ్రాడ్యుయేషన్ డే' ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దుబాయ్ యువరాజు 'HH Sheikh Hamdan bin Mohammed bin Rashid Al Maktoum' హాజరు అయ్యి దుబాయ్ పోలీస్ అకాడమీ 25వ బ్యాచ్ ను తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించవలసిందిగా కోరారు.
ఈ కార్యక్రమం మరో విశిష్టత ఏంటంటే 'దుబాయ్ పోలీస్' వ్యవస్థ సరికొత్త లోగో ఆవిష్కరణ కూడా ఉండటం. 'దుబాయ్ పోలీస్' యొక్క కమాండర్-ఇన్-చీఫ్ సరికొత్త లోగో తో కూడిన జండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమాండర్ మాట్లాడుతూ ' సెక్యూరిటీ, కమ్యూనికేషన్, ఇన్నోవేషన్ అనే మూడు కోణాలు తమ ముఖ్య ఎజెండా అని తెలియజేసే ఉద్ధ్యేస్యంతో రూపించిందే ఈ లోగో' అని తెలియజేసారు.
అంతేకాకుండా ప్రపంచంలోనే ఖరీదైన కార్లను పాట్రోలింగ్ కు వాడే 'దుబాయ్ పోలీస్' సంస్థ ఇప్పుడు మరో కొత్త కారును ఉపోయోగించనుంది. అదే 'Bentley Bentayga 2018'.. నిజమేనండి!! దుబాయ్ పోలీసా మజాకా!!
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







