మొన్నేగా పెళ్లైంది.. అప్పుడే అనుష్క శర్మకు ఏమైంది
- January 10, 2018
మోస్ట్ పాపులర్ కపుల్‌గా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విరుష్క జంట పెళ్లి అనంతరం ఎవరి రంగాల్లో వారు బిజీగా ఉన్నారు. కథానాయికగానే కాకుండా నిర్మాతగా కూడా మారి సక్సెస్ అయ్యింది. తనే నిర్మాతగా, ఆ పై హీరోయిన్‌గా వస్తున్న 'పరి' చిత్ర టీజర్‌ని ట్విటర్‌లో విడుదల చేసింది. అందమైన ఆమె ముఖం నిండా రక్తపు మరకలు. ఒకింత బాధ, మరి కొంత ఆవేశం ఈ చిత్రంలో కనబడుతోంది. ఈ పోస్టర్ ఆ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో అనుష్కతో పాటు రీటాభరీ చక్రవర్తి, పరంబాత్రా చటర్జీ, రజత్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా అనంతరం షారుక్‌తో 'జీరో', వరుణ్ ధావన్‌తో 'సూయీ ధాగా' చిత్రాలకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. వివాహానంతరం విరామం తీసుకున్న అనుష్క సోమవారం నుంచి షూటింగ్‌లో పాల్గొనబోతోంది. 'పరి' చిత్రాన్ని మార్చిలో హోలీ సందర్భంగా ప్రేక్షకులు ముందుకు తీసుకు రావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







