రవితేజ- శ్రీను వైట్ల మూవీపై అప్డేట్
- January 10, 2018
మాస్ మాహారాజా రవితేజ రీ ఎంట్రీతోను అదరగొడుతున్నాడు. బెంగాల్ టైగర్ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రవితేజ రీసెంట్ గా రాజా ది గ్రేట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీతో మాస్ మహారాజా ఈజ్ బ్యాక్ అని నిరూపించాడు. ఇక టచ్ చేసి చూడు అనే సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. రీసెంట్‌గా ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళింది. ఇక ఈ మూవీ పూర్తైన తర్వాత నీ కోసం సినిమాతో సోలో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసి తనకి వెంకీ,దుబాయ్ శీను వంటి బ్లాక్ బస్టర్ లు ఇచ్చిన శ్రీను వైట్లతో రవితేజ ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ మూవీకి అమర్ అక్బర్ ఆంథోని అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు సమాచారం. టైటిల్ ని బట్టి చూస్తుంటే ఈ మూవీలో రవితేజ మూడు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడా అనే డౌట్ కలుగుతుంది. ప్రస్తుతం వైట్ల ఈ సినిమా కోసం లొకేషన్స్ సెర్చింగ్ లో ఉన్నాడట. యూఎస్ లో తన టీంతో కలిసి పలు లొకేషన్స్ సెర్చ్ చేస్తున్న దర్శకుడు ఈ చిత్రంలో రవితేజని ఎన్ఆర్ఐగా చూపించనున్నాడట. తన ట్రేడ్ మార్క్ కామెడీతో సినిమాని రూపొందించనున్న వైట్ల ఆగస్ట్‌లో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నట్టు సమాచారం.
ఈ లోపే చిత్రానికి సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ ఫైనలైజ్ చేసి అనౌన్స్ చేయనున్నారని టాక్.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయంలో రూ.14 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
- ఓటమి పై యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం ఏమన్నారంటే?
- హైదరాబాద్ లో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే రూట్ ఖరారు
- షేక్ జాయెద్ రోడ్డులో మోటార్ సైక్లిస్ట్ మృతి..!!
- ముబారకియా మార్కెట్ కోసం ఏసీ వాక్వేలు..!!
- అమీర్, యూఏఈ ప్రెసిడెంట్ భేటీ..!!
- ఇరాన్-IAEA ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- ఉద్యోగిని కొట్టిచంపిన వ్యక్తికి జీవితఖైదు..!!
- పిల్లలు, యువతపై వాతావరణ మార్పుల ప్రభావంపై అధ్యయనం..!!
- యూఏఈ పై భారత్ ఘన విజయం