‘అజ్ఞాతవాసి పరిహాసమేమో అనుకున్నా..!’

- January 10, 2018 , by Maagulf
‘అజ్ఞాతవాసి పరిహాసమేమో అనుకున్నా..!’

దుబాయ్‌ : అదృష్టదేవత ఎప్పుడు ఎవరికి ఎందుకు వరమిస్తుందో తెలియదు! ఒకవేళ వరమిచ్చినా అది నిజమని నమ్మాలనిపించదు!! పరాయి దేశంలో దర్జాగా సెటిలైన ఓ భారతీయుయ కుటుంబం ఇప్పుడు సరిగ్గా ఇలాంటి స్థతిలోనే ఉంది. సరదాగా కొన్న లాటరీ టికెట్‌కు రూ.21కోట్ల జాక్‌పాట్‌ లభించింది. దుబాయ్‌ సహా ఇండియా అంతటా మారుమోగుతోన్న ఈ వార్త వివరాల్లోకి వెళితే..

అలెప్పి(కేరళ)కు చెందిన హరి కృషన్‌ దుబాయ్‌లో బిజినెస్‌ డెవలపర్‌గా సెటిలయ్యారు. అతనికి భార్యా,కొడుకు ఉన్నారు. దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో ఒకటిరెండుసార్లు లాటరీ టికెట్లు కొన్నా బహుమతి తగల్లేదు. హరికి అదేమంత పెద్ద విషయంకాదు. ఇటీవల 500 దిరామ్స్‌పెట్టి ఇంకో లాటరీ టికెట్‌ కొని ఆ సంగతి మర్చిపోయారు.

రెండు రోజుల కిందటే లాటరీ ఫలితాలు వచ్చాయి. హరి కొన్న టికెట్‌ నంబర్‌కే రూ.12లక్షల దిరామ్స్‌(సుమారు రూ.21కోట్లు) జాక్‌పాట్‌ తగిలింది. ‘‘రూ.21కోట్ల బంపరాఫర్‌ కొట్టేశారని ఫోన్‌ వచ్చింది.. ఎవరో అజ్ఞాతవాసి పరిహాసం చేస్తున్నాడేమో అనుకున్నా. అలా నాలుగైదు కాల్స్‌ తర్వాత ఓ మీడియా మితృడి నుంచి ఫోనొచ్చింది, అటుపై ఓ రేడియో స్టేసన్‌ నుంచి!! వెంటనే నా భార్యకు చెప్పాను.. లాటరీ కంపెనీ వెబ్‌సైట్‌ చూడమని. చివరికి ఆమె కన్ఫార్మ్‌ చేస్తేగానీ నమ్మలేదు. ఇంతటి అదృష్టం ఇంకా కలగానే అనిపిస్తోంది’’  అని చెప్పుకొచ్చాడు హరి. ఈ సొమ్మును తన భవిష్యత్‌ అవసరాల కోసం అట్టిపెట్టుకుంటానని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com