మళ్ళీ ఇంధన ధరలను పెంచే యోచన లేదు
- January 10, 2018
కువైట్: ఇంధన ధరల పెంపునకు కువైట్ ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేయడం లేదని ఒక ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. చమురు మార్కెట్ అభివృద్ధిని పర్యవేక్షిస్తూ, వస్తున్నమార్పులతో అనుగుణంగా ధీటుగా వ్యవహరించడానికి అత్యుత్తమ మార్గాలను వెతికేందుకు ప్రభుత్వ రాయితీ కమిటీ చర్చలు కొనసాగిస్తున్నందున, ఇంధన ధరల పెరుగుదల గురించి ఎక్కడా పేర్కొనలేదని తెలిపింది.. నాలుగు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) లో చేసిన నిర్ణయాలు ఇంధన ధరలను పెంచుతుందని చెపుతున్నాయి, అయితే ఇలాంటి చర్యలు తీసుకోలేదు. యుఎఇ, ఖతార్, ఒమన్ మరియు సౌదీ అరేబియాలలో ధరల పెరుగుదలకు కారణమైన కారణాలపై సంబంధిత చమురు అధికారులు నివేదికలు చేశారు. యూఏఈ మరియు సౌదీ అరేబియాలో విలువ జోడించిన పన్ను (వేట్ ) అమలు చేసిన తర్వాత ఇది జరిగింది. సౌదీ అరేబియాలో 127 శాతం పెరిగి, 2017 నాటి కన్నా 20 శాతం వృద్ధిని సాధించగా అదే యుఎఇలో 3.9-4.2 శాతం పెరిగాయి. ఒమన్ ఇంధన ధరలు 2-7 శాతం, కతర్ లో 2.8-3 శాతం పెరిగాయి. 2016 సెప్టెంబరులో మాత్రమే చివరిసారి కువైట్ ఇంధన ధరలు పెరిగాయి.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







