సీనియర్ నటుడు సుబ్బరాయశర్మకు జంధ్యాల పురస్కారం
- January 12, 2018విజయవాడ: వన్‌టౌన్‌లోని వినాయకుడి గుడి పక్కన ఉన్న ఏవీఎస్ హోటల్స్‌లో ఈ నెల 14వ తేదీన విజయవాడ అభిరుచి సాహితీ సాంస్కృతిక సంస్థ, స్వీట్ మ్యాజిక్ ఏవీఎస్ హోటల్స్ సంయుక్త నిర్వహణలో, దర్శకుడు స్వర్గీయ జంధ్యాల జయంతి వేడుకలను సంక్రాంతి వేడుకలలో భాగంగా నిర్వహిస్తున్నట్లు అభిరుచి సాహితీ సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు పులిపాక కృష్ణాజీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సంవత్సరం ఇచ్చే జంధ్యాల పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ సినీ, రంగస్థల, టీవీ నటుడు సుబ్బరాయ శర్మకు అందిస్తున్నట్లు చెప్పారు.
ఆకాశవాణి విశ్రాంత స్టేషన్ డైరెక్టర్ పి.పాండురంగారావును ఈ సందర్భంగా సన్మానిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీనటుడు నరేష్, యువ నటుడు రక్షిత్ అట్లూరి, విజయవాడ జాయింట్ సీపీ బివి.రమణకుమార్, ఇన్‌కంటాక్స్ జాయింట్ కమిషనర్ టి.సత్యానందం, జంధ్యాల సతీమణి అన్నపూర్ణ, కుమార్తెలు, ఇతరులు అతిథులుగా పాల్గొంటారని చెప్పారు. శాస్త్రీయ నృత్య ప్రదర్శన, హాస్యప్రహసనాలు, ఈలపాట తదితర కార్యక్రమాలుంటాయని తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







