దింగాలేశ్వర శాఖ మఠం మహాలింగ స్వామీజీ ఆత్మహత్య
- January 12, 2018
సంసార బంధాలనుంచి విముక్తి కోసం సన్యాసం స్వీకరిస్తే అక్కడ కూడా మనశ్శాంతి కరవాయే. ఏమి సేతుర లింగా అంటూ కర్ణాటకకు చెందిన ఓ స్వామీజీ ఆత్మహత్య చేసుకున్నారు. కర్ణాటకలోని హుళ్లత్తి గ్రామ దింగాలేశ్వర శాఖ మఠం మహాలింగ స్వామీజీ (38) ఆత్మహత్య చేసుకున్నారు. గదం జిల్లా శిరహట్టి తాలూకాలోని బాలేహోసూర్కి చెందిన దింగాలేశ్వర మఠంలో ఉండేవారు. ఆదివారం అర్థరాత్రి మఠంలో ఎవరూ లేని సమయం చూసి డెత్ నోట్ రాసి సూసైడ్ చేసుకున్నారు. మరుసటి ఉదయం మఠానికి వచ్చిన భక్తులు స్వామీజీ అచేతనంగా పడి ఉండడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి డెత్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. తన మరణానికి ఎవరూ కారణం కాదని, గత కొంత కాలంగా మనశ్శాంతి లేదని అందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తన దేహానికి మఠంలోనే అంత్యక్రియలు నిర్వహించాలనే కోరికను వెల్లడించారు స్వామీజీ సూసైడ్ నోట్లో.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







