ఖతార్ గగనతలంలో వాయుసేన ఉల్లంఘన ఆరోపణపై యూఏఈ ఖండన

- January 12, 2018 , by Maagulf
ఖతార్ గగనతలంలో వాయుసేన ఉల్లంఘన ఆరోపణపై యూఏఈ ఖండన

యూఏఈ : దాడులు జరిపే ఓ విమానం డిసెంబరులో ఖతార్ గగనతలంలో ఎగరడం ద్వారా ఉల్లంఘించినట్లు కతర్ ఆరోపించింది. సంఘటన గురించి ఐక్యరాజ్యసమితిలో దోహా ఫిర్యాదు చేసింది. "ఎమిరాటీ ఉల్లంఘన గురించి కతర్ ఫిర్యాదు చేయడం అవాస్తవంగా మరియు గందరగోళంగా ఉందని " యూఏఈ  విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ అన్వర్ గర్గాష్ ట్విట్టర్ లో చెప్పారు."మేము ఆ ఆరోపణని రుజువులతో సహా అధికారికంగా ప్రతిస్పందించడానికి కృషి చేస్తున్నాం,వారి ఆరోపణ ఒక తీవ్రమైన  మరియు అన్యాయమైన ఆరోపణని ఆయన తెలిపారు. "పట్టికలో ఏం జరుగుతోందో ఇప్పుడు తెరచుకుంటోంది," అని మంత్రి చెప్పారు. తీవ్రవాదులకు మద్దతు ఇస్తున్నందున గత జూన్ నుంచి కతర్ ను అరబ్ దేశాలు బహిష్కరణకుగురిచేశాయి  సౌదీ అరేబియా, యుఎఇ, బహ్రెయిన్ మరియు ఈజిప్టు దేశాలు వేరుగా ఉండటంతో  గల్ఫ్ లో కొంతమేరకు ఉద్రిక్తతలు పెరిగాయి.అంతేకాక  దోహాకు అన్ని విమానాలను నిషేధించి, అత్యధిక వాణిజ్య సంబంధాలను నిలిపివేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com