తల్లి పేరుతో జక్కన్న చెక్కిన సరస్వతి నిలయం...!!

తల్లి పేరుతో జక్కన్న చెక్కిన సరస్వతి నిలయం...!!

బుల్లి తెర నుంచి వెండి తెరపై దర్శకుడిగా అడుగు పెట్టిన రాజమౌళి.. బాహుబలి సినిమాతో తెలుగు వాడి జెండాను ప్రపంచ వ్యాప్తంగా ఎగరవేసి.. తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు. కాగా తాను మంచి దర్శకుడినే కాదు.. మంచి మనసున్న వ్యక్తి అని కూడా రాజమౌళి నిరూపించుకున్నారు. తన తల్లి జననీ రాజనందిని పేరిట పాఠశాల భవనం నిర్మించి తన ప్రత్యేకను చాటు కున్నారు. వివరాల్లోకి వెళ్తే...
2014 లో విశాఖ జిల్లాను హుదూద్ తుఫాను అతాకుతలం చేసింది. ఈ తుఫాన్ దాటికి విశాఖ లో పలు చెట్లు.. భారీ భవనాలు సైతం కూలిపోయాయి. అలా కూలిపోయిన భవనాల జాబితాను దర్శక దిగ్గజం రాజమౌళి పరిశీలించారు. ఆ లిస్ట్ లో 154 ఏళ్ల చరిత్ర కలిగిన విశాఖ జిల్లా కశింకోటలోని దురిశేటి పెదనర్సింహ మూర్తి (డీపీఎన్) జెడ్పీ హై స్కూల్ కూడా ఉంది. దీంతో రాజమౌళి ఆ భవనాన్ని మళ్ళీ  నిర్మించాలనుకున్నారు.. తన వంతు సాయంగా భవన నిర్మాణానికి రూ. 40లక్షలను అందించారు.. ఈ నేపథ్యంలో 2015 లో 4 గదులతో పాఠశాల భవననిర్మాణం ప్రారంభమైంది. ఇలా జక్కన్న చెక్కిన సరస్వతీ నిలయానికి తన తల్లి జననీ రాజనందిని పేరు పెట్టారు. అంతేకాదు.. భవన శిలాఫలకం పై రాజమౌళి తో పాటు ఎమ్ ఎమ్ కీరవాణి, వైఎస్ శోభనాద్రి, టి. ప్రశాంతి పేర్లు ఉన్నాయి. కాగా రాజమౌళి తన నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. 

Back to Top