అజ్ఞాతవాసికి మరో చుక్కెదురు!
- January 12, 2018
సోషల్ మీడియాలో మొదలైన వ్యతిరేక ప్రచారంతో పాటు మౌత్ కాన్వాసింగ్ కూడా తోడవ్వడంతో 'అజ్ఞాతవాసి' వసూళ్లకు గండి పడక తప్పదన్నది ఒక లెక్క. అయినా సంక్రాంతి అనేది లాంగ్ వెకేషన్ కావడంతో కలెక్షన్స్ మీద ప్రొడ్యూసర్లకు ఇంకా ఆశలు బతికే వున్నాయి. ఇదిలా ఉంటే.. సినిమా కంటెంట్ పరంగా కూడా.. కొత్త సవాల్ ని ఎదుర్కోవాల్సి వచ్చేలా వుంది. ఇది నా సినిమాకు కాపీ అంటూ రచ్చకెక్కిన ఫ్రెంచ్ డైరెక్టర్ జెరోం సల్లే.. లీగల్ చర్యలకు దిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
"సినిమా చూశా.. బాగా తీశారు.. పవన్ కళ్యాణ్ క్రేజ్ ని కూడా కళ్లారా చూశా" అంటూ ట్వీట్ చేసి.. తొలిరోజు అజ్ఞాతవాసి నెత్తిన పాలు పోసినంత పని చేశారు. కానీ.. సినిమా పబ్లిక్ టాక్ తిరగబడిందన్న వార్తల నేపథ్యంలో ఆయన కూడా.. ఈ గ్యాప్ ని క్యాష్ చేసుకునే అవకాశం ఉందట. తన 'లార్గో వించ్' మూవీకీ 'అజ్ఞాతవాసి'కీ చాలా పోలికలున్నాయంటూ విడుదల తర్వాత తానే ప్రకటన చేయడంతో..
ఆయన ఉద్దేశం మీద అనుమానాలొచ్చేశాయి. టీ-సిరీస్ వాళ్లకు అంతోఇంతో ఇచ్చి ఇండియాలో లీగల్ సమస్య లేకుండా సర్దేసిన 'అజ్ఞాతవాసి' మేకర్స్.. విదేశాల్లో హక్కుల విషయాన్ని మాత్రం తేలిగ్గా తీసుకున్నారు. ఇప్పుడు..
అజ్ఞాతవాసి 'మాతృక' లార్గో వించ్ మూవీ డైరెక్టర్ జెరోం సల్లేను కూడా సంతృప్తి పర్చాల్సిన అత్యవసర పరిస్థితి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







