ఛాలెంజింగ్ రోల్లో కనిపించనున్న శ్రియ
- January 13, 2018టాలీవుడ్ సీనియర్ హీరోలతో పాటు కుర్ర హీరోలతోనూ నటించిమెప్పించిన సీనియర్ హీరోయిన్ శ్రియ ప్రస్తుతం ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. 17 ఏళ్లుగా కెరీర్ కొనసాగిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు పాధాన్యమున్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటున్నారు. తాజాగా మరో ఆసక్తికరమైన పాత్రకు ఓకె చెప్పింది ఈ బ్యూటీ.
కొత్త దర్శకురాలు సుజన దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో ప్రయోగాత్మక పాత్రలో నటించనుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నారు. లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా సంగీతమందిస్తున్న ఈసినిమాకు సాయి మాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా మార్చిలో సెట్స్ మీదకు వెళ్లనుంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు