మోహన్‌బాబు 'గాయత్రి' టీజర్ రెడీ

- January 13, 2018 , by Maagulf
మోహన్‌బాబు 'గాయత్రి' టీజర్ రెడీ

డైలాగ్ కింగ్ మోహన్‌బాబు తన సొంత బ్యానర్ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం 'గాయత్రి'. ఈ సినిమాలో మోహన్‌బాబు రెండు విభిన్న పాత్రల్లో దర్శనమీయనున్నారు. మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు కథ, మాటలు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మోహన్‌బాబు, మంచు విష్ణు, శ్రియ, నిఖిల విమల ఫస్ట్‌లుక్స్ విడుదలై విశేష స్పందన పొందగా.. తాజాగా చిత్రానికి సంబందించిన టీజర్‌ని బయటకు వదిలింది చిత్రయూనిట్. హై ఇంటెన్సిటీ కూడిన మోహన్‌బాబు అప్పీరెన్స్, ఆయన నుంచి అభిమానులు కోరుకునే పవర్ఫుల్ డైలాగ్స్ చిత్రంలో ఆశించవచ్చని ఈ టీజర్ చెప్పకనే చెబుతోంది.

"రామాయణంలో రాముడికి, రావణాసురుడికి గొడవ. మహాభారతంలో పాండవులకు, కౌరవులకు మాత్రమే గొడవ. వాళ్ళు వాళ్ళు కొట్టుకుని ఎవరో ఒకరు చనిపోయుంటే బాగుండేది. కానీ వాళ్ళ మూలంగా జరిగిన యుద్ధంలో అటు ఇటు కొన్ని లక్షల మంది సైనికులు చనిపోయారు. పురాణాల్లో వాళ్ళు చేసింది తప్పయితే, ఇక్కడ నేను చేసింది కూడా తప్పే.. అక్కడ వాళ్ళు దేవుళ్లయితే ఇక్కడ నేను దేవుడినే. అర్థం చేసుకుంటారో అపార్థం చేసుకుంటారో.. ఛాయస్ ఈస్ యువర్స్" అని మోహన్‌బాబు పలికిన డైలాగ్ చిత్రం పై ఆసక్తిని మరింత పెంచుతోంది.

మంచు విష్ణు, శ్రియ మొదటిసారి జతకట్టిన ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కానుంది. ఇందులో బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, నిఖిల విమల్, అనసూయ భరద్వాజ్ ఇతర పాత్రలలో కనిపించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com