సౌదీ అరేబియాలో ఫుట్‌బాల్ మ్యాచ్ ని చూసేందుకు స్టేడియంలో మహిళలు
- January 13, 2018
రియాద్: టీవీలలో చూడటం మినహా ఏనాడూ స్టేడియంలోనికి వెళ్ళి కూర్చొని చూడని సౌదీ అరేబియా మహిళలు తొలిసారిగా క్రీడా మైదానంలోకి అడుగుపెట్టి ఆటను నేరుగా తిలకించారు.సౌదీ రాజు సాల్మాన్ ఆదేశాల మేరకు వారు స్వేచ్ఛగా ప్రత్యక్షంగా ఫ్యూట్బాల్ మ్యాచ్ ని చూశారు. సౌదీ అరేబియాలో మహిళలు క్రీడా మైదానాల్లోకి ప్రవేశించకూడదనే నిబంధన ఉండేది. ఇటీవల ప్రభుత్వం ఆ నిషేధం ఎత్తివేయడంతో మొదటిసారిగా మహిళలు స్టేడియంకు వచ్చి ఆటను వీక్షించి ఆనందించారు. జెడ్డా నగరంలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ కు ఒక చరిత్రాత్మకమైన రికార్డ్ నమోదైంది. గ త ఏడాది పలు విప్లవాత్మకమైన సౌదీ అరేబియాలో సంస్కరణలు జరిగాయి. మహిళలకు కార్లు డ్రైవింగ్ చేసే అవకాశాన్ని కల్పించారు. అంతేకాకుండా సినిమా హాళ్లలో సైతం మహిళలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







