దుబాయ్ లో వాసవి కృప వారి వనభోజనాల సందడి..!!
- November 21, 2015
వాసవి కృప దుబాయ్ వారి 12 వ సంవత్సర కార్తీక మాస వనభోజనాలు, స్థానిక దుబాయ్ జబీల్ పార్క్ లో సంప్రదాయం గా నిర్వహించారు.
400 మంది విచ్చేసిన ఈ కార్యక్రమంలో స్థానికంగా సంఘసేవ చేస్తున్న ప్రజ్ఞ టీచర్స్ ను సత్కరించారు. ఇండియా నుండి ప్రముఖ వైశ్య నేత శ్రీ బెల్ది శ్రీధర్ గారిని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించి సత్కరించారు. దుబాయ్ వైశ్య వ్యాపారవేత్తలు శ్రీ మంచుకొండ వెంకట్ మరియు వివేక్ బొజ్జ గారిని కూడా సత్కరించారు.
భోజనాలలో డ్రై ఫ్రూట్ పూతరేకు, తాపేశ్వరం కాజా ప్రత్యేకంగా ఇండియా నుండి తెప్పించారు. రోజంతా నిర్వాహకులు ఆటపాటలతో అల్లరించారు.
వాసవి కృప వ్యవస్థాపకులు శ్రీ గణేష్ రాయపూడి , శ్రీ వంగవీటి శ్రీనివాస్, శ్రీ కృష్ణ వురా,శ్రీనివాస్ రేనికంటి,సురేష్ రామదాసు గార్లు మొత్తం వాసవి కృప ప్రోగ్రాం దొనొర్స్ కు, వాలంటీర్స్ టీం కి ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమ నిర్వాహక సభ్యులు శ్రీ ఎండురి శ్రీనివాస్, శ్రీ కృష్ణ మోహన్,మిస్టర్ & మిస్సెస్ పల్తి శ్రీనివాస్,మిస్టర్ & మిస్సెస్ అరట్లికట్ట శ్రీనివాస్ ,మిస్టర్ & మిస్సెస్ పబ్బా శ్రీనివాస్ ,శ్రీ దేవకాంత్ మరియు శ్రీ అనిల్ కుమార్ తదితరులు పైన పేర్కొన్న సభ్యుల వలన కార్యక్రమం జెయప్రదం అయ్యిందని నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
మాగల్ఫ్.కామ్ వారి తరపున 'వాసవి కృప' టీంకు ప్రత్యేక అభినంధనులు.
ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని ఆశిస్తున్నాము.











తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









