‘ఊరంతా అనుకుంటున్నారు..!’ ఫస్ట్‌లుక్
- January 16, 2018
సీనియర్ నటుడు నరేష్ వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన హీరో నవీన్ కృష్ణ విజయ్. నందిని నర్సింగ్ హోమ్ సినిమాతో హీరోగా పరిచయం అయిన నవీన్ త్వరలో మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా వెల్లడించాడు నవీన్. ‘అమ్మానాన్న నాకు నడక నేర్పారు.. నడవడికను మా ఊరు నాకు నేర్పింది.. రామాపురం.. మరి మా కథ ఏంటో చూద్దామా.. నా రాబోయే చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’’ అంటూ ఆ సినిమా టైటిల్ లోగోను ఆసక్తికరంగా విడుదల చేశారు.
అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన రైతు కుటుబం సినిమాలోని ఊరంతా అనుకుంటున్నారు పాట పల్లవితో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్, మేఘా చౌదరి, సోఫియా సింగ్, జయసుధ, రావూ రమేష్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాతో పాటు తండ్రి నరేష్(సీనియర్)తో కలిసి విఠలాచార్య సినిమాలో నటిస్తున్నాడు నవీన్.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







