హజ్ యాత్రికులకు సబ్సిడీ ఎత్తివేత
- January 16, 2018
హజ్ యాత్రికులకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం షాక్ ఇచ్చింది. హజ్ యాత్రికులకు అందిస్తున్న సబ్సిడీని ఎత్తివేస్తున్నట్లు కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ముక్తర్ అబ్బాస్ నక్వీ ప్రకటించారు. దీంతో ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లే 1.75 లక్షల మందిపై సబ్సిడీ భారం పడనుంది.
ఇప్పటివరకూ హజ్ యాత్రకు వెళ్లేవారికి ప్రతి ఏటా రూ. 700 కోట్ల సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం అందజేస్తూ వచ్చింది. హజ్ యాత్రకు సబ్సిడీ నిలుపుదల వల్ల మిగిలే డబ్బును మైనార్టీ బాలికలు, మహిళల సంక్షేమానికి వినియోగిస్తామని నక్వీ పేర్కొన్నారు. హజ్ యాత్రకు ఇస్తున్న సబ్సిడీ ద్వారా ఏజెంట్లు మాత్రమే లాభపడుతున్నారని, ముస్లింలు లాభం పొందడం లేదని అన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







