మహిళ స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరణ
- January 16, 2018
స్టాఫ్ అకామడేషన్‌లో ఓ మహిళ స్నానం చేస్తుండగా, వీడియో తీసిన కేసులో ఓ వ్యక్తికి న్యాయస్థానం మూడు నెలల జైలు శిక్ష విధించింది. 21 ఏళ్ళ భారతీయుడొకరు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆఫీస్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నిందితుడు, బాత్రూమ్‌లోని ఓ చిన్న రంధ్రాన్ని చేసి, ఆ రంధ్రం ద్వారా మొబైల్ ఫోన్ కెమెరా నుంచి లోపల స్నానం చేస్తున్న మహిళను వీడియో తీశాడు. 2017 అక్టోబర్ 10న ఈ ఘటనపై బాధితురాలు అల్ రఫా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగింది. బాధితురాలు 28 ఏళ్ళ ఫిల్పినో జాతీయరాలు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. తనను ఎవరో వీడియో తీస్తున్న విషయాన్ని తెలుసుకున్న బాధితురాలు గట్టిగా అరిచేసరికి, నిందితుడు అక్కడినుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు తొలుత బుకాయించడంతోపాటుగా, మొబైల్‌లో తాను చిత్రీకరించిన వీడియో కూడా డిలీట్ చేసేశాడు నిందితుడు.
తాజా వార్తలు
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ







