అమెరికాలో కరీంనగర్ వాసి దుర్మరణం
- January 16, 2018
అమెరికాలో తెలుగు వ్యక్తి దుర్మరణం చెందాడు. సౌత్‌ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భరత్‌రెడ్డి మృతి చెందాడు. ఈ దుర్ఘటన మూడు రోజుల కిందటే జరిగింది. అయితే భరత్‌రెడ్డి గాయపడినట్లు మాత్రమే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు స్నేహితులు. భరత్‌రెడ్డి మరణం విషయం చెప్పలేక స్నేహితులు సతమతమవుతున్నారు. పీఆర్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మారెడ్డి కుమారుడు భరత్‌రెడ్డి. సౌత్‌ఫ్లోరిడాలో ఈనెల 13న స్నేహితులతో కలిసి సైక్లింగ్ చేస్తున్న సమయంలో అదుపు తప్పి భరత్‌రెడ్డి కిందపడిపోయాడు. అదే సమయంలో అటుగా వస్తున్న ట్రక్కు అతనిపై నుంచి దూసుకెళ్లింది. దీంతో భరత్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో భరత్ గాయపడినట్లుగానే అతడి కుటుంబసభ్యులకు ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్పారు స్నేహితులు. సోదరుడి మరణవార్త తెలిసిన వెంటనే ఆస్ట్రేలియాలో ఉంటున్న భరత్ అన్న అమెరికాకు బయలుదేరినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







