24న రంగస్థలం టీజర్ విడుదల
- January 16, 2018
రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్‌ల కలయికలో రూపొందుతున్న రంగస్థలం-1985 చిత్రంపై అంచనాలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రంలో చిట్టిబాబు పాత్రను పోషిస్తున్న రామ్‌చరణ్ కొత్త పోస్టర్‌ను విడుదలచేశారు. అదే సమయంలో ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేస్తారని ప్రేక్షకాభిమానులు ఆశించారు. అయితే ఈ పోస్టర్లో ఈ నెల 24న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించడంతో అభిమానులు ఊరట చెందారు. మరోవైపు రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కూడా రంగస్థలం కోసం వెయిటింగ్ అంటూ ట్వీట్ చేశారు. రామ్‌చరణ్ సరసన సమంత నాయికగా నటిస్తున్న ఈ చిత్రం పల్లెటూరి ప్రేమకథ నేపథ్యంలో పీరియాడికల్‌గా సాగనుంది. ఇప్పటివరకు రాజమండ్రి, పోలవరం, హైదరాబాద్‌లలో ఈ చిత్రం షూటింగ్ జరిగింది. చివరి షెడ్యూల్లో మిగిలివున్న కొన్ని కీలక సన్నివేశాలను, రెండు పాటలను రాజమండ్రి పరిసరాల్లో చిత్రీకరిస్తారని సమాచారం. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ చిత్రంలోని ఇతర ముఖ్యపాత్రల్లో ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాష్‌రాజ్, రావురమేష్, అనసూయ నటిస్తుండగా, దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని, రత్నవేలు ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







