ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్
- January 16, 2018
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరోసారి భారీ ఆఫర్లతో వినియోగదారుల ముందుకు రానుంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రిపబ్లిక్ డే సేల్ పేరుతో జనవరి 21 నుంచి జనవరి 23వరకూ పలు వస్తువులను తగ్గింపు ధరలకు అందించనుంది. సిటీ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులపై 10శాతం క్యాష్ బ్యాక్‌ను ఇవ్వనుంది. మరో ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ఇండియా కూడా గ్రేట్ ఇండియా సేల్ పేరుతో ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకూ వివిధ వస్తువులపై ఆఫర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై రాయితీ ప్రకటించింది. ముఖ్యంగా ల్యాప్‌టాప్‌లు, ఆడియో, కెమెరా, యాక్ససరీస్‌పై 60శాతం వరకూ తగ్గించింది. ఇక దుస్తులు, చెప్పులు, ఇతర వస్తువులపై 50 నుంచి 80శాతం రాయితీ ఇస్తున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







